31/12/2024న పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అందజేసిన అనంతరం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు ముఖ్యమంత్రి గారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి మరియు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.