సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల ప్రజలకు ఎస్సై శ్రీశైలం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని కోరారు. ర్యాలీలకు, సౌండ్ డీజే సిస్టములకు అనుమతి లేదని, ప్రజలు ఈ నిబంధనలను గౌరవించాలన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, ఇది ప్రజల భద్రతకు ప్రమాదకరమని శ్రీశైలం స్పష్టం చేశారు. రాత్రిపూట రోడ్లపై తిరగకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
పండుగ వేడుకలు ప్రజల జీవితాలను పాడు చేయకుండా జరుపుకోవాలన్న లక్ష్యంతో పోలీసులు సమర్థమైన చర్యలు చేపడతామని చెప్పారు. నూతన సంవత్సరం వేడుకలను అందరూ నియమాలు పాటించి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.