నాగబాబు, పల్లాకు మంత్రి పదవి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒకే ఒక్క మంత్రి పదవిని జనసేన నేత నాగబాబు కు ఇవ్వాలని ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
పల్లాకు మరో కీలక పదవి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు కూడా మంత్రి పదవి కేటాయించాలని చంద్రబాబు యోచనలో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త విధానాలు అమలు చేయడానికి యువ నాయకులను కేబినెట్లో చేర్చాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రులపై వేట..?
కేబినెట్లో ఉన్న మంత్రుల్లో అంచనాలను అందుకోలేని ఇద్దరిపై వేటు పడవచ్చని సమాచారం. వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారి స్థానంలో కొత్త నాయకులను తీసుకుని మరింత సమర్థంగా పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అభివృద్ధి లక్ష్యాల దిశగా ముందడుగు
కేబినెట్ విస్తరణ తర్వాత, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో వేగం పెంచేందుకు సీఎం చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. కొత్త మంత్రులతో ఏపీ అగ్రస్థానంలో నిలవడమే ఆయన ప్రాధాన్యంగా ఉందని స్పష్టమవుతోంది.