అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప-2 కలెక్షన్లు భలేగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వెర్షన్ ఈ చిత్రం అప్రతిహతంగా దూసుకెళ్లి బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతోంది. 18వ రోజు ఆదివారం (డిసెంబర్ 22) ఈ సినిమా అంచనాలను మించి రూ.33.25 కోట్లు వసూలు చేసింది.
ఈ కలెక్షన్లతో మూడవ వారం వీకెండ్‌లో రూ.72.3 కోట్లు వసూలు చేసిన పుష్ప-2, అనేక చిత్రాలు ఓపెనింగ్స్ సమయంలో కూడా ఇన్ని కలెక్షన్లు రాబట్టలేకపోయాయని ‘శాక్‌నిల్క్’ పేర్కొంది. ఆదివారం రూ.33.25 కోట్లు, శనివారం రూ.24.75 కోట్లు, శుక్రవారం రూ.14.3 కోట్లు వసూలు చేయగా, ఈ చిత్ర వసూళ్లు దేశవ్యాప్తంగా రూ.1,062.9 కోట్లకు చేరాయి.
2017 నుంచి ఏకంగా 7 సంవత్సరాలు ఉండి చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి-2 రూ.1,040 కోట్ల వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. దీంతో, పుష్ప-2 విడుదలైన దాదాపు మూడు వారాల్లోనే రూ.1,600 కోట్లు దాటింది. దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ₹1,600 కోట్ల వసూళ్లతో పుష్ప-2 ప్రస్తుతం దంగల్ (₹2000 కోట్లు) మరియు బాహుబలి-2 (₹1790 కోట్లు) తర్వాత ఈ స్థానం దక్కించుకుంది. క్రిస్మస్ నుంచి న్యూఇయర్ వరకు హాలిడే సీజన్ ఉంటున్నందున పుష్ప-2 మరింత దూసుకెళ్లే అవకాశం ఉందని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.