సంగారెడ్డి జిల్లా జైల్లో శిక్ష అనుభవించిన కొడంగల్ లగచర్ల గ్రామ రైతులు ఈరోజు బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో జైలుకు చేరుకొని రైతులకు ఘనంగా స్వాగతం పలికారు.
రైతులు జైలు నుంచి విడుదలై తమ కుటుంబాలను కలిసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. వారి కన్నీటితో గడిన ఈ స్వాగతం ప్రతి ఒక్కరికీ ఎమోషనల్ అనుభూతిని ఇచ్చింది.
రైతులు మాట్లాడుతూ, “మా భూములను ప్రభుత్వానికి ఇవ్వలేము. ఎన్ని అడ్డంకులు వచ్చినా, మా హక్కుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గిరిజన నాయకులు జైపాల్ నాయక్, రాజేందర్ నాయక్, పలువురు పార్టీ అధినేతలు పాల్గొన్నారు.