- ఒక్క సారి వాడి వదిలేసె ప్లాస్టిక్ వద్దెవద్దు
- ఎకో వైజాగ్, మిషన్ లైఫ్ లను జయప్రదం చేద్దాం
- ఎన్ ప్రేమ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, విశాఖపట్నం
ఒక్కసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ వాడి అనారోగ్యానికి గురి కావద్దు అని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ కుమార్ కోరారు. జి విఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాలు అనుసరించి బుధవారం ఉదయం ఈస్ట్ పాయింట్ కాలనీలోని కెడిపిఎమ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాల మీద గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఇఓ మాట్లాడుతూ. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ప్రభలుతున్నాయి అన్నారు. ఒక్క సారి వాడి వదిలేసె ప్లాస్టిక్ వద్దెవద్దు అని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఎస్ ఆర్ యు – జి విఎంసి ప్రోజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి ఒక్క సారి వాడి వదిలేసె 16 రకాల ప్లాస్టిక్ పై పూర్తి ఆంక్షలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు. ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారింది అన్నారు.
దీనిని దృష్టి లోనికి తీసుకొని విద్యార్థులు అందరూ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు తమ కుటుంబీకులకు వివరించి వాటి వినియోగానికి అడ్డుకట్ట వేయాలన్నారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ వాడి వదిలేసే ప్లాస్టిక్ కాల్చడం వల్ల అనేక రకాల విష తుల్య రసాయనాల కాలుష్యం వల్ల జీవ వైవిధ్యానికి, భవిష్యత్తు తరాలకు కలిగే నష్టాలు వర్ణనాతీతం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ ఎం సుమతీ బాయి, తెలుగు ఉపాధ్యాయుని సత్యవతి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఒక్క సారి వాడి వదిలేసె ప్లాస్టిక్ వద్దెవద్దు, మానవాళి జీవించడానికి మరో భూ గోళం లేదని నినాదాలు పలికారు……