ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత గారి ఆదేశాల ప్రకారం, చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాగిరెడ్డిగూడెం గ్రామంలో దేశావతు లక్ష్మి వద్ద నుంచి 30 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. నాటు సారాయి తయారీలో ఉపయోగించే 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
దేశావతు లక్ష్మి పై కేసు నమోదు చేసి, నాటు సారాయి విక్రయాలకు సహకరించిన దేశావతు నాగేశ్వరరావు పై పరారీ కేసు పెట్టారు. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో వేముల గంగయ్య స్వామి పై 129 BNSS చట్టం ప్రకారం చర్యలు తీసుకొని, తహసీల్దార్ ఎదుట హాజరుపరిచారు.
టి. నరసాపురం మండలం వల్లంపట్ల గ్రామంలో పరారీ నిందితురాలు బాలిన నాగలక్ష్మిని అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ విధించారు. నాటు సారాయి తయారీ, విక్రయం పూర్తిగా నియంత్రణలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.
ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్.ఐ.లు ఆర్.వి.ఎల్. నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ సి.ఐ. పి. అశోక్ ఈ దాడుల విజయవంతమైన నిర్వహణకు నాయకత్వం వహించారు. ఈ చర్యల ద్వారా నాటు సారాయి నిర్మూలనకు కీలకమైన అడుగులు వేశారు.

 
				 
				
			 
				
			 
				
			