విజయనగరం టౌన్‌లో రామతీర్థం బాధితుడైన శ్రీ చందక సూరిబాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన ఘటనలో బాధితుడైన సూరిబాబు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగింది.
ఈ ఆర్ధిక సహాయం చెక్కును విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి, ఎపి మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలను గుర్తించి, వారికి ఆపదలో ఆర్ధిక సహాయం అందించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్ని నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కార్యకర్తలకు మరింత ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని అందించే చర్యగా అభివర్ణించారు.
