మెదక్ జిల్లాలో 473 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి చివరిగింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని సన్నరకం దాన్యానికి 500 రూపాయల బోనస్ రైతులకు ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలో పిఎసిఎస్ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాo మండలంలోని సూరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి వైస్ చైర్మన్ నగేష్ లు శాలువాతో సన్మానం చేశారు అదేవిధంగా సూరారంలో దాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏపీడి సరస్వతి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 473 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు విక్రయించిన ధాన్యానికి 48 గంటల్లోనే నేరుగా తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
సన్నరకం దాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, జంగారై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీడి సరస్వతి, తహసిల్దార్ మన్నన్, డిపిఎం మోహన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఏపిఎం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ,రాజు రెడ్డి, సుధాకర్, గోపాల్ రెడ్డి, సురేందర్ నాయక్,జీవన్, రమేష్ గౌడ్, రాజా సింగ్, అక్బర్, పవన్ గౌడ్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
