వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా 30లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ హోంగార్డ్ విభాగానికి చెందిన వి.సుధాకర్ మామూనూర్ నాల్గవ పటాలంలో విధులు నిర్వహిస్తుండగా, గత ఆగస్టు 13వ తేదిన మామూనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ సుధాకర్ మరణించడం జరిగింది. మరణించిన సుధాకర్ యాక్సిస్ బ్యాంక్ జీతానికి సంబంధించిన ఖాతాదారుడు కావడంతో యాక్సిస్ యాజమాన్య మరణించిన హోంగార్డ్ కుటుంబానికి ముప్పై లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును మరణించిన హోంగార్డ్ సతీమణి కొమలకు వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మరణించిన హోంగార్డ్ కుటుంబ సభ్యుల స్థితిగతులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు, పోలీస్‌పరంగా సహాయ సహకారాలు అందిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమములో హోంగార్డ్స్ ఆర్.ఐ చంద్ర శేఖర్, యాక్సిస్ బ్యాంక్ వరంగల్ ఏరియా బాధ్యుడు కృష్ణ హోసూర్, బ్యాంక్ సిబ్బంది వంశీ, శ్రీధర్ పాల్గోన్నారు.
హోంగార్డ్ కుటుంబానికి 30 లక్షల బీమా చెక్కు
 The Commissioner of Police, Warangal, handed over a ₹30 lakh insurance cheque to the family of deceased Home Guard Sudhakar, who died in a road accident
				The Commissioner of Police, Warangal, handed over a ₹30 lakh insurance cheque to the family of deceased Home Guard Sudhakar, who died in a road accident
			
 
				
			 
				
			