నర్సంపేట పట్టణంలో పిడిఎస్ రైస్ ను అక్రమంగా ఓ ఇంట్లో రహస్యంగా నిలువ చేసారనే పక్క సమాచారం మేరకు సుమారు 8 గంట ప్రాంతాన వరమ్మ తోటలో ఎక్కటి,కిరణ్ వ్యక్తి ఇంటి వద్ద నర్సంపేట సీఐ డి. రమణ మూర్తి, ఎస్సై లు సిహెచ్, రవికుమార్, జి . అరుణ్ తన సిబ్బందితో రహస్యంగా నిల్వచేసిన ప్రదేశానికి వెళ్లి తనిఖి చేయగా సుమారు 25 క్వింటాల బియ్యం పిడిఎస్ రైస్ దాదాపు 65,000/- రూపాయల విలువగల పిడిఎస్ రైస్ ను స్వాదీన పరచుకొని అతని పై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.
ప్రభుత్వం పేదలకు సరఫరా చేయు పిడిఎస్ రైస్ ప్రభుత్వంచే నిషేదించబడినటువంటి ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని నర్సంపేట సిఐ, రమణమూర్తి తెలిపారు.