సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టిఎఫ్ బృందం తనిఖీలు చేపట్టింది. బాలనగర్‌లో జరిగిన ఈ దాడిలో 2.3 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎస్టిఎఫ్ బృందం లీడర్ నంద్యాల అంజి రెడ్డి తెలిపారు.
వాహన తనిఖీల సమయంలో స్క్రూటీలో గంజాయి తరలిస్తుండగా నిందితుడు మహ్మద్ సోయబ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
దాడిలో గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, స్క్రూటీ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వ్యవస్థను రద్దు చేయడంలో సీఐ ఎంపిఆర్ చంద్రశేఖర్, ఎస్సై సాయి, కిరణ్‌రెడ్డి, ఇతర పోలీసులు కీలక పాత్ర పోషించారు.
ఈ విజయవంతమైన దాడి గురించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి బృందాన్ని అభినందించారు. నిందితుల వివరాలు సేకరించి, సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను పూర్తిగా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.