నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఇందిరానగర్ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బొడ్డు రాజకుమార్-విజయలక్ష్మి దంపతులకు 2017లో వివాహమైంది.
నాలుగు సంవత్సరాల ఎదురుచూపులకు కరుణించిన దేవుడు 2023లో వారికి పాపను ఇచ్చాడు, కానీ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు.
పాప తల పెరిగి అనారోగ్యానికి గురవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు రూ. రెండు లక్షల వరకు ఖర్చు చేశారు.
వైద్యులు పాపకు హైడ్రో సిఫాలస్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు చెప్పడంతో దంపతులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు.
మెదడులో నీరు చేరడం వల్ల చిన్నారి తల కదలలేని పరిస్థితి ఏర్పడింది, హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఉస్మానియాలో శస్త్ర చికిత్స నిర్వహించినా, పాపకు ఇంకా అనుకూలమైన పరిష్కారం దొరకలేదు.
ప్రస్తుతం 18 నెలల వయస్సున్న పాపకు మరింత చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. మూడు లక్షల ఖర్చు అవసరమవుతుందని తెలిపారు.
కూలి పని చేసే దంపతులు ఈ భారాన్ని భరిస్తూ సాయం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
