చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆధ్వర్యంలో కాషాయ ధ్వజం ఆవిష్కరణ.
ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సామాజిక సమరసత ప్రముఖ్ ఆముదం వెంకటేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచ్ పరివర్తన పేరుతో గ్రామాలలో సమాజాన్ని రక్షించడం కోసం స్వయం సేవక్ గా వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం గ్రామ వికాసం కోసం గ్రామ స్వరాజ్యం కోసం పౌర విధులు నిర్వహించడం కోసం వన మహోత్సవం రక్షించడం కోసం దేశం రక్షించుకోవడానికి సమాజంలో స్వయంసేవక్ భాగం పంచుకోవాలని స్వయంసేవక్ గుణగణాలు పెంచుకోవాలని దేశంలో 150 శాఖలు నడుస్తున్నాయని 153 వేల శివ కేంద్రాలు ఒక కోటి 50 లక్షల మంది స్వయం సేవకులు ఉన్నారని వ్యక్తి నిర్మాణం అనేది రాష్ట్రీయ స్వయంసేవతో సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రామానుజపురం ప్రభాకర్ సంజీవ్ గౌడ్ నాయిని ప్రవీణ్ కుమార్, దుర్గం నవీన్ గౌడ్, కుమ్మరి రాము, దుర్గం స్వామి గౌడ్, పుట్ట సాయిబాబా, స్వామి, శ్రీనివాస్, షేరు స్వామి, నర్సింలు, రాజు మహేష్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
