పేదింటి ఆడ పిల్లలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఒక వరం లాంటిదని చిన్న శంకరంపేట మండలంలో 1 కోటి 68 లక్షలు రూపాయలు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పంపిణీ చేశామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందచేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ…. అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని, ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోపే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా చిన్నశంకరంపేట మండలంలో కోటి 60 లక్షల రూపాయలతో చెక్కులు పంపిణీ చేశామని, అలాగే సీఎంఆర్ఎఫ్ 6 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు.
మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వం అని చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో చేసిన అవినీతిని బయటపెట్టి అవినీతికి పాల్పడ్డ సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు అందే విధంగా చేస్తామని అవినీతికి పాల్పడ్డ వారిని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతుందని 470 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి రైతులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో ఈరోజు జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ప్రమాదంలో మరణించిన వారికి సానుభూతి తెలియజేస్తూ మరణించిన వారికి పోస్టుమార్టం తొందరగా నిర్వహించి మృతదేహాన్ని త్వరగా అప్ప చెప్పే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్సలు అందించి త్వరగా కోలుకునే విధంగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మన్నన్, జంగారై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, గంగా నరేందర్, రమేష్ గౌడ్, జీవన్, బిక్షపతి, మోహన్ నాయక్, రాజాసింగ్, అశోక్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, శివప్రసాద్, కుమార్ సాగర్, ,వివిధ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
