హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో మోంటీ ప్రొడక్షన్స్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ACP పూర్ణచందర్రావు గారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్డు నుంచి ప్రారంభించి ఐమాక్స్ వరకు కొనసాగింది. అనంతరం ఐమాక్స్ లొ మాక్ డాన్స్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసిపి పూర్ణచంద్రరావు గారు మీడియాతో మాట్లాడుతూ మొంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సమాజంలోని మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించే విధంగా ఈ వాక్ నిర్వహించడం జరిగిందని . 17 ఆగస్టు 20 24 న కొంపల్లి లో జరగబోయే మిస్టర్ అండ్ మిసెస్ గార్జియస్ ఆఫ్ ఇండియా 20 24 సీజన్ 4th ఫైనల్ కాంటెస్ట్ లో పాల్గొనే అందరు అభ్యర్థులు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరిని అభినందిస్తూ మోంటీ ప్రొడక్షన్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.