పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఏర్పాటు చేయబడింది.
ఈ శిబిరాన్ని డాక్టర్ జాక్సన్ గారు మరియు పి.ఆర్.ఓ అశ్విన్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో కంటి సంబంధిత చికిత్సలు పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పేషెంట్లకు వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యసేవలు అందించారు.
పరీక్షల అనంతరం, కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించిన కొంతమంది పేషెంట్లను వైద్యులు ప్రత్యేకంగా గుర్తించారు.
ఆపరేషన్ చేయాల్సిన రోగులను జాతీయ అందత్వ నివారణ సంస్థ, జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సమీక్షించి అవసరమైన చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
శంకర్ ఫౌండేషన్ సహకారంతో వీరికి వైద్య సేవలు అందించనున్నారు.
ఆపరేషన్ అవసరమైన పేషెంట్లను ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్సలు జరపనున్నారు. ఈ శిబిరం ద్వారా చాలా మంది ప్రజలు తమ కంటి సమస్యలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందారు.
ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని, కంటి సమస్యల నివారణకు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని డాక్టర్లు సూచించారు.
