సముద్ర తీరంలో మళ్లీ సందడి – తెరుచుకున్న సూర్యలంక బీచ్‌ గేట్లు 

బాపట్ల సూర్యలంక బీచ్‌లో పర్యాటకులు తిరుగుతున్న దృశ్యం

ఎట్టకేలకు బాపట్ల సూర్యలంక బీచ్‌ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు తాళాలు తీసివేయడంతో పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా కార్తీక మాసం కావడంతో భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో సముద్ర తీరానికి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

బాపట్ల సూర్యలంక బీచ్‌



ముంథా తుఫాను ప్రభావంతో బీచ్‌లో గుంతలు ఏర్పడటంతో భద్రతా కారణాల రీత్యా కొంతకాలం పాటు బీచ్‌కు ప్రవేశం నిషేధించారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణమయ్యాయని నిర్ధారించుకున్న అధికారులు పర్యాటకులను బీచ్‌కు అనుమతించారు.

కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాల కోసం భక్తులు తరలివస్తుండగా, పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

ఈ సందర్భంగా బాపట్ల రూరల్‌ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ “బీచ్‌లో ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులను దాటి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. పోలీసు శాఖ సూచించిన ప్రాంతాల్లో మాత్రమే స్నానం చేయాలి” అని సూచించారు.

బాపట్ల రూరల్‌ సీఐ శ్రీనివాసరావు

ALSO READ:Ind vs Aus 5th T20I:గబ్బాలో వర్షం అంతరాయం – గిల్, అభిషేక్‌ శర్మ దూకుడు బ్యాటింగ్‌!


అలాగే తుఫాను ప్రభావం కారణంగా కొంతమంది పర్యాటకులకు ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొంటూ, ఈత కొట్టకుండా కేవలం మునిగి స్నానాలు మాత్రమే చేయాలని ఆయన సూచించారు.

పోలీసు శాఖ మార్గదర్శకాలను భక్తులు, సందర్శకులు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *