జిల్లా పాలనాధికారి రాజర్షి షా సిరికొండ మండలంలో రాయిగూడ, కొండాపూర్ గ్రామాల్లో పర్యటించి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను పరిశీలించారు. 16-20వ తేదీ వరకు సర్వే పూర్తి చేసి, 21న గ్రామసభల్లో జాబితా ప్రవేశపెట్టాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా తయారు చేయాలని, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ తుకారాం, DLPO ఫణీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
