రామాయంపేటలోపశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం మర్డర్ ఘటన నిరసిస్తూ రామాయంపేటలో వైద్యులు ఓపి సేవలను నిలిపివేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపుమేరకు నిరసన తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైద్యులు సిద్దిపేట చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వైద్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని వైద్యులపై దాడులను ఖండించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ చట్టంలో అత్యంత కఠినమైన శిక్ష ఏది ఉన్న అది ఆ నిందితునిపై అమలు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు