“విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ – డీపీఆర్ బాధ్యత బార్సిల్‌కు”

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు కలను సాకారం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది.విశాఖపట్నం మరియు విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ బాధ్యతలు సికింద్రాబాద్‌కు చెందిన బార్సిల్ సంస్థకు అప్పగించారు.ఈ మేరకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.టెండర్ ప్రక్రియలో అనేక కంపెనీలు పోటీపడ్డా, బార్సిల్ సంస్థ తక్కువ ధర కోట్ చేయడంతో రాష్ట్ర మెట్రోరైల్ కార్పొరేషన్ దీనిని సిఫార్సు చేసింది.బార్సిల్ సంస్థ ఇప్పటికే వివిధ మాస్టర్ ప్లాన్‌లు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో అనుభవం కలిగి ఉండగా, ఇప్పుడు A.P మెట్రో ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం ఆశాజనక అభివృద్ధిగా పరిగణించబడుతోంది.ఇదిలా ఉండగా, విశాఖ మరియు విజయవాడ నగరాల వాసులు మెట్రో ప్రారంభంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. DPR పూర్తయిన తర్వాత టెండర్ల దశ, నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. "విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు నూతన మైలురాయి!"

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు కలను సాకారం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది.విశాఖపట్నం మరియు విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ బాధ్యతలు సికింద్రాబాద్‌కు చెందిన బార్సిల్ సంస్థకు అప్పగించారు.ఈ మేరకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.టెండర్ ప్రక్రియలో అనేక కంపెనీలు పోటీపడ్డా, బార్సిల్ సంస్థ తక్కువ ధర కోట్ చేయడంతో రాష్ట్ర మెట్రోరైల్ కార్పొరేషన్ దీనిని సిఫార్సు చేసింది.బార్సిల్ సంస్థ ఇప్పటికే వివిధ మాస్టర్ ప్లాన్‌లు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో అనుభవం కలిగి ఉండగా, ఇప్పుడు A.P మెట్రో ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం ఆశాజనక అభివృద్ధిగా పరిగణించబడుతోంది.ఇదిలా ఉండగా, విశాఖ మరియు విజయవాడ నగరాల వాసులు మెట్రో ప్రారంభంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. DPR పూర్తయిన తర్వాత టెండర్ల దశ, నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *