విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మరియు పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు.
మండవ జానకిరామయ్య సుమారు 27 సంవత్సరాల పాటు విజయ డెయిరీ ఛైర్మన్‌గా పనిచేశారు.
తన పదవీకాలంలో పాడి రైతుల ఆదాయాన్ని పెంచడం, వారికి గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక సంస్కరణలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో విజయ డెయిరీ విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందింది.
Read Also:ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబో నుంచి సెన్సేషన్ – “డ్రాగన్” సెట్ నుంచి కొత్త స్టిల్ వైరల్!
పాడి పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషి కారణంగా ఆయన పేరు రైతుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచింది. మండవ జానకిరామయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం స్వగ్రామమైన మొవ్వలో జరగనున్నాయి. ఆయన మరణంపై పలు రాజకీయ నాయకులు, సహకార సంఘ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
