విజయ్-రష్మిక నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!


టాలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా సినీ వర్గాల్లో, అభిమానుల్లో వీరి ప్రేమాయణం గురించి చర్చ సాగుతూనే వచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో హీరో-హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి జంట గురించి గాసిప్స్ మొదలయ్యాయి. ఇద్దరూ ఎప్పుడూ దీనిపై అధికారికంగా స్పందించకపోయినా, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, పోస్ట్‌లు, ఒకరిపై ఒకరు చేసిన కామెంట్స్ వీరి మధ్య ఉన్న బంధానికి బలం చేకూర్చాయి.

తాజాగా హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఇరువురి కుటుంబ పెద్దలు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు అందజేసినట్లు తెలుస్తోంది. ఇక వివాహానికి సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే శుభముహూర్తం ఖరారైనట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఈ నిశ్చితార్థం వార్త వెలువడగానే అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో అత్యంత క్యూట్ కపుల్స్‌లో ఒకరుగా భావించే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే పెళ్లి ఏర్పాట్లలో ఈ జంట బిజీ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *