విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న!

Rashmika Mandanna and Vijay Deverakonda wedding news update

రష్మిక మందన్న వరుస సినిమాలతో పాటు నటుడు విజయ్ దేవరకొండతో ఉన్న బంధంపై వస్తున్న వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక, తన జీవిత భాగస్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనను అర్థం చేసుకునే వ్యక్తి, అన్ని పరిస్థితుల్లో తనకు అండగా నిలిచే వ్యక్తి కావాలని రష్మిక తెలిపింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా తన కోసం పోరాడే మనసున్న భాగస్వామి కావాలనేది ఆమె కోరిక అని తెలిపింది.

“నన్ను నిజంగా అర్థం చేసుకునే, నా కోణంలో కూడా ఆలోచించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను. నా కోసం యుద్ధం చేయగల ధైర్యం ఉన్న మనిషిని కోరుకుంటున్నాను” అని ఆమె స్పష్టం చేసింది.

ALSO READ:రైతుల కేక – ‘మా పంటల్ని కొనండి’ అంటూ రోడ్డుపై ధర్నా

ఇక, అలాంటి వ్యక్తి కోసం అవసరమైతే బుల్లెట్‌ కైనా ఎదురెళ్తానని ఆమె నవ్వుతూ చెప్పింది. గత నెల అక్టోబర్‌ 3న విజయ్‌, రష్మికల నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.

అయితే, రష్మిక దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు కానీ, “నా ఎంగేజ్మెంట్‌ విషయమై మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతాను” అని చెప్పి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.

ఒక ఫ్యాన్‌ అడిగిన “మీరు డేట్ చేస్తే ఎవరితో చేస్తారు? పెళ్లి చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు?” అన్న ప్రశ్నకు రష్మిక సరదాగా సమాధానమిచ్చింది “డేట్ చేస్తే యానిమేషన్ క్యారెక్టర్ నారుటోతో చేస్తాను. కానీ పెళ్లి చేసుకుంటే విజయ్ దేవరకొండతోనే చేస్తాను” అని తన మనసులోని మాట బయటపెట్టింది.

ఈ సమాధానంతో అక్కడి అభిమానులు చప్పట్లతో కంగ్రాట్యులేషన్స్‌ చెప్పగా, రష్మిక చిరునవ్వుతో “థాంక్స్‌” చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *