మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని, మహేశ్వరం నియోజకవర్గంలో గల తుక్కుగూడలో గల కెఎల్ఆర్ క్యాంప్ కు,బాలాపూర్ గణనాథుడి ఉత్సవ కమిటీ
ఆఫీసుకి వెళ్లి ఆయనకు ఆహ్వానం పలికారు.ఆయన ఈ సందర్భంగా వారితో ఈనెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును తీసుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకుంటామని, ఆయన కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ ఛైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డికి తెలిపారు.
అలాగే వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరులు ప్రపంచ ప్రసిద్ధి గాంచాయని, దశాబ్దాలుగా వాటి విశిష్ట తగ్గకుండా ఉత్సవ కమిటీ కాపాడుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు అని ఆయన వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ బ్యాంకు చైర్మన్ పెంటారెడ్డి, మహేశ్వరి జయంత్ కుమార్, శశిధర్ రెడ్డి, నర్రారి గౌడ్, సుధాకర్ రెడ్డి, రాఘవరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మారెడ్డి బాలాపూర్ గణపయ్యను దర్శించేందుకు ఆహ్వానం
