రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ

PM Modi and Megastar Chiranjeevi extended heartfelt birthday wishes to Telangana CM Revanth Reddy, wishing him good health, long life, and success in public service. PM Modi and Megastar Chiranjeevi extended heartfelt birthday wishes to Telangana CM Revanth Reddy, wishing him good health, long life, and success in public service.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, రేవంత్‌ రెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు పంపించారు. “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలకు స్పందించిన రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. “హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు” అని రీట్వీట్ ద్వారా అభినందనలు అందుకున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది రేవంత్ రెడ్డికి అద్భుతంగా సాగాలని, ఆయురారోగ్యాలతో ఆయ‌న ప్రజా సేవలో విజయవంతం కావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

కాగా, రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో 1969 నవంబర్ 8న జన్మించారు. శుక్రవారంతో ఆయ‌నకు 55 ఏళ్లు పూర్తి అయ్యాయి. 2023 డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి, అంతకుముందు మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యునిగా కూడా సేవలందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *