రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు

BRS steps up heat on Telangana CM over Rs 1,000 crore deal, files complaint  with ED

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు సీఎంకు నోటీసులు పంపింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందంటూ రేవంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ ప్రచారంలో నిజం లేనప్పటికీ ప్రజల్లో పార్టీపై అపనమ్మకం, గందరగోళం ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మే 4న కొత్తగూడెం సభలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

వెంకటేశ్వర్లు తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది హంసా దేవినేని మాట్లాడుతూ.. పరువు నష్టం కేసులో రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు జారీచేసిందని, ఆయన కోర్టుకు ఎప్పుడు రావాలన్న విషయాన్ని న్యాయస్థానం నేడు నిర్ణయిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను బీజేపీ ఎత్తివేస్తుందన్న రేవంత్ వ్యాఖ్యలపై ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పరువు నష్టం కేసు పెట్టినట్టు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *