యువత వ్యాయామం మానేస్తే భవిష్యత్తు అంధకారం!


ప్రస్తుతకాలంలో యువత జీవనశైలి పూర్తిగా మారిపోయింది.
సెల్ఫోన్, జల్సాలు, రాత్రుళ్లు ఎక్కువ మెలకువగా ఉండటం…
ఉదయం ఆలస్యంగా లేవడం…
ఇవి ఇప్పుడు సాదారణంగా కనిపించే అలవాట్లే.

కానీ… ఇప్పుడే యంగ్ ఏజ్ లో ఉన్నందువల్ల అన్ని బాగానే అనిపిస్తున్నాయి.
అయితే వయసు 40 ఏళ్లు దాటిన తర్వాత, ఈ అలవాట్ల ఫలితాలు బయటపడతాయి.
శరీరంలో రోగాలు ఒక్కొక్కటిగా తలెత్తుతాయి.

👉 ఉదయం లేచి వాకింగ్, వ్యాయామం, జిమ్, ఆటలు –
ఇవి చాలా ఉపయోగకరమని తెలిసినా, యువతలో ఆ ఆలోచన కనిపించడం లేదు.
వీటితో డయాబెటిస్, బీపీ, స్ట్రోక్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ వంటి వ్యాధులను
ఎక్కువ వరకూ దూరం పెట్టవచ్చు.

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…
30 ఏళ్లు కూడా నిండకముందే యువతలో వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.

📊 రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన NCD సర్వే ప్రకారం –
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
గుండె సంబంధ వ్యాధులతో 1,86,403 మంది,
మధుమేహంతో 2,43,390 మంది,
క్యాన్సర్ లక్షణాలతో 3,375 మంది బాధపడుతున్నారు.
ఇందులో ఎక్కువ మంది 30 ఏళ్లు లోపువారే!

➡️ 8.3 లక్షల మంది యువతలో, కేవలం 40 వేల మంది మాత్రమే వ్యాయామం చేస్తున్నారు.
మిగిలినవారు శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.

👴 మరో ఆసక్తికర విషయం ఏమిటంటే –
40 ఏళ్లు దాటిన తర్వాతే ప్రజలు మైదానాలు, జిమ్లు, వాకింగ్ ట్రాక్స్పై కనిపిస్తున్నారు.
యువత మాత్రం అసలు పట్టించుకోవడం లేదు.
నిపుణులు చెబుతున్నట్లుగా…
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడిస్తే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

👉 నడకలోని కొన్ని విశేషాలు :

  • ఎక్కువ బరువు ఉన్నవారు తారు రోడ్డు లేదా గట్టినేలపై కాకుండా ఇసుక నేలపై నడిస్తే మోకాళ్లకు ఒత్తిడి తగ్గుతుంది.
  • ఇసుకలో నడకతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
  • నిదానంగా నడిస్తే 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చవుతాయి.
  • 30 నిమిషాల నడకలో 25 కేలరీలు, వేగంగా నడిస్తే అరగంటలో 50కిపైగా కేలరీలు ఖర్చవుతాయి.

💡 కాబట్టి యువత వ్యాయామం మానేస్తే…
వారి భవిష్యత్తు అంధకారమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడే అలవాట్లు మార్చుకుంటేనే… రేపు సంపూర్ణ ఆరోగ్యంతో బతికే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *