మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి గండిపేట, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ భూముల కేటాయింపు

మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రణాళిక చిత్ర దృశ్యం

RAJENDRA NAGAR:మూసీ నది తీరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్‌ మండలాల్లోని విస్తారమైన భూములను మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం కేటాయించింది.

గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని ఈ కేటాయింపులు చేసింది. ఆ భూములపై ఉన్న పాత నిర్మాణాలను కూడా తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు.

తద్వారా, ఆయా సంస్థలకు శంషాబాద్‌ మండలంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌, భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో కొత్త భవనాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో హిమాయత్‌సాగర్‌ సమీపంలోని వాలంతరి, సహకార ఎపెక్స్‌ బ్యాంక్‌, ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌, రెడ్డి వసతిగృహం, ఇతర సంస్థలకు కొత్త స్థలాలు కేటాయించనున్నారు. అలాగే **ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (IIPH)” భారత్‌ ఫ్యూచర్‌సిటీలో స్థాపించబడనుంది.

ALSO READ:పల్నాడు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ఇదే సమయంలో,గండిపేట, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ మండలాల్లో ఉన్న 734.07 ఎకరాల ప్రభుత్వ భూమిలో 233.38 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉండగా, మిగిలిన 500.09 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఖాళీ భూములను స్వాధీనం చేసుకుని **మూసీ రివర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌కు** అప్పగించనున్నారు.

అయితే, కొత్వాల్‌గూడలోని సర్వే నంబర్‌ 54లో హెచ్‌ఎండీఏ ఎకోపార్క్‌ కోసం ఇచ్చిన 71.23 ఎకరాలు ఇప్పటికే అభివృద్ధి దశలో ఉండటంతో భూసేకరణ జాబితా నుంచి మినహాయించబడింది.

అధికారులు త్వరలో ప్రాజెక్టు పనులు వేగవంతం చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *