మా ఇల్లు పింఛన్ కాలిపోయాయి వృద్ధ దంపతుల ఆవేదన:కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామంలో ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో వృద్ధ దంపతులు చేకూరి అమ్మన్న, కళావతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా మంటలకు ఆహుతైంది.

గత 40 ఏళ్లుగా ఆ ఇంట్లో నివసిస్తున్న వీరి జీవిత సంపాద్యమంతా క్షణాల్లో బూడిదైపోయింది. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటి పైకప్పు నుంచి మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు హటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
కళావతిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినప్పటికీ, ఇంట్లో ఉన్న మంచాలు, బీరువా, టేబుల్ ఫ్యాన్, మరియు ఇటీవలే తీసుకున్న రూ. 4 వేల పింఛన్ సహా అన్ని వస్తువులు బూడిదయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి అమ్మన్న కన్నీరు మున్నీరయ్యాడు.
ALSO READ:విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న!

ఇంటి వస్తువులన్నీ కాలిపోవడంతో ఆ వృద్ధ దంపతులు కట్టుబట్టలతో మిగిలారు. బాధితులను ఆదుకునేందుకు కుడుపూడి శివన్నారాయణ రూ. 5,000 నగదు, బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
తాళ్లరేవు విద్యుత్ శాఖ ఏఈ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్పంచ్ పెయ్యల మంగేష్, శ్రీనివాస్, టేకుమూడి లక్ష్మణరావు, కొప్పిశెట్టి బాబి, పొన్నమండ రామలక్ష్మి, అత్తిలి బాబురావు తదితరులు ఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు.
