తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ వార్తతో హరీశ్ రావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రాజకీయ, సామాజిక వర్గాలు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హరీశ్ రావు తండ్రి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రకటనలో, “తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం కలగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు సాదాసీదా జీవనశైలి, మానవతా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా పరిచయం ఉన్నారు. ఆయన మరణం హరీశ్ రావు కుటుంబానికి, సన్నిహితులకు తీవ్ర లోటుగా మారింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.
