మలాలా ఆక్స్‌ఫర్డ్‌లో గంజాయి తాగి గత దాడి జ్ఞాపకాలకు లోనయ్యారు


నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, విద్యా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ తన జీవితానికి సంబంధించిన ఒక సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో స్నేహితులతో గంజాయి (మారిజువానా) తాగినప్పటి అనుభవం ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశుందని ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మలాలా వివరించడం ప్రకారం, గంజాయి తీసుకున్న తర్వాత తనపై 13 ఏళ్ల క్రితం జరిగిన తాలిబన్ దాడికి సంబంధించిన భయంకరమైన జ్ఞాపకాలు మళ్లీ మెదిలించాయి. “ఆ రాత్రి తర్వాత అన్నీ మారిపోయాయి. నాపై జరిగిన దాడికి అంత దగ్గరగా నేను ఎప్పుడూ అనుభూతి చెందలేదు. ఆ దాడిని మళ్లీ ఎదుర్కొంటున్నట్టే అనిపించింది” అని ఆమె పేర్కొన్నారు. గంజాయి ప్రభావంతో స్పృహ కోల్పోయి, ఒక స్నేహితుడు ఆమెను గది నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఆ సంఘటన సమయంలో బస్సు, తుపాకీ పట్టుకున్న వ్యక్తి, రక్తం వంటి దృశ్యాలు ఒక్కసారిగా కళ్లముందు మెదిలాయి. “నా శరీరం భయంతో వణికిపోయింది. నా సొంత మనసు నుంచే నేను తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది” అని మలాలా చెప్పారు. ఈ ఘటన తర్వాత ఆమెకు పానిక్ ఎటాక్స్, నిద్రలేమి, తీవ్ర ఆందోళన మొదలైన సమస్యలు ఏర్పడ్డాయి.

మానసిక సమస్యల పరిష్కారానికి థెరపిస్ట్ను సంప్రదించారని, చిన్నతనంలో తాలిబన్ల పాలన, పాఠశాల దాడి, చదువుల ఒత్తిడి మొదలైనవి మానసిక గాయానికి కారణమని గుర్తించారని మలాలా వెల్లడించారు. క్రమంగా థెరపిస్ట్ సహాయంతో ఆ భయంకరమైన జ్ఞాపకాల నుంచి కోలుకుని, మళ్లీ స్తిరమైన జీవితం కొనసాగించగలిగిందని చెప్పారు. ఈ అనుభవాలను ఆమె **తదుపరి పుస్తకం ‘ఫైండింగ్ మై వే’**లో వివరించనున్నారు.

ప్రసిద్ధ మలాలా 2012లో, తన 15వ ఏట, పాకిస్థాన్ స్వాత్ లోయలో పాఠశాల బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తాలిబన్ల కాల్పులకి గురై తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్‌లో చికిత్స పొందిన ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో మలాలా, మహిళల విద్య, క్రీడల ప్రోత్సాహం కోసం తన భర్త అస్సెర్ మాలిక్తో కలిసి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *