మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడైన షైన్ టామ్ చాకో తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై, ఆయన తండ్రి ప్రాణాలు కోల్పోయారు.వివరాల్లోకి వెళితే ఈ ప్రమాదం సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. షైన్ టామ్ చాకో, తన తండ్రి సి.పి. చాకోతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం నియంత్రణ తప్పి ప్రమాదానికి గురైంది.ప్రమాదంలో సి.పి. చాకో గారు అక్కడికక్కడే మరణించారు. షైన్ టామ్ చాకోకి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావొచ్చని అధికారులు తెలిపారు.ఈ వార్త మలయాళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అభిమానులు, సహనటులు షైన్ టామ్ చాకో కుటుంబానికి తమ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం – తండ్రి మృతి
"మలయాళ నటుడికి షాక్ – రోడ్ యాక్సిడెంట్లో తండ్రి మృతి"
