ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 34వ నిందితుడు చెరుకూరి వెంకటేశ్ నాయుడుకి చెందిన ఐఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఫేస్ ఐడీ ద్వారా అన్‌లాక్ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను న్యాయమూర్తి పి. భాస్కరరావు జారీ చేశారు.
సిటీ (SIT) దర్యాప్తు బృందం వెంకటేశ్ నాయుడి ఫోన్‌లో కీల్‌క ఆధారాలు ఉంటాయని భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్న వీడియోను ఇదే ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ కేసుకు సంబంధించి మరిన్ని డిజిటల్ రికార్డులు, సంభాషణలు, ఇతర కీలక సమాచారాలు కూడా ఫోన్‌లో భద్రపరచబడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
దర్యాప్తు కోసం ఫోన్ లాక్‌ను తెరవాలనే సిట్ అభ్యర్థనపై కోర్టు పిటిషన్‌పై విచారణ జరిపి, ఫేస్ ఐడీ ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ పరిణామంతో మద్యం కుంభకోణం కేసులో నూతన మలుపు రాబోయే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.