బోరబండలో బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నిర్ణయంతో భాజపా శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తొలుత అనుమతిచ్చి తర్వాత రద్దు చేయడం అన్యాయం అని పార్టీ నాయకులు మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి పోలీసులు తలొగ్గారనే ఆరోపణలు చేశారు.
భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు మాట్లాడుతూ, బండి సంజయ్ సభను ఏ పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బోరబండకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచిస్తూ, బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు.
Also Read:కేజీఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూత – థైరాయిడ్ క్యాన్సర్‌తో మృతి
