పారిస్ ఒలింపిక్స్‌లో ఓటమి: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న ఆటకు వీడ్కోలు

పారిస్ ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. భారత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు పేర్కొన్నాడు. ఇకపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోనని స్పష్టం చేశాడు. దేశం తరపున ఇదే తన చివరి మ్యాచ్ అని చెప్పాడు. ఆటపరంగా తాను ఏ స్థితిలో ఉన్నానో స్పష్టంగా అర్థమైందని వ్యాఖ్యానించాడు. వీలైనంత కాలం టెన్నిస్‌ను ఆస్వాదిస్తూ ఉంటానని స్పష్టం చేశాడు. ఏటీపీ టోర్నీల్లో ఆడతానంటూ బోపన్న క్లారిటీ ఇచ్చాడు.

2026 జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ నుంచి భారత్ తరపున తప్పుకుంటానని తెలిపాడు. కాగా డేవిస్ కప్ నుంచి రోహన్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. కాగా ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్న బోపన్న కల నెరవేరకుండానే కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది. 

2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను తొలిసారి పాల్గొన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌ అతడికి మూడవ ఒలింపిక్స్‌గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *