SPS నెల్లూరు జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం-జిల్లా యస్.పి. శ్రీ కృష్ణకాంత్,IPS., గారు
సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

నెల్లూరు టౌన్ చంద్రబాబు నగర్ నందు తెల్లవారుజామున కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించిన నెల్లూరు పోలీసులు.
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు టౌన్ DSP గారి ఆద్వర్యంలో CI, SI, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 80 మందితో ఆపరేషన్. సుమారు 500 ఇళ్ళు తనిఖీ..సరైన పత్రాలు లేని 17 బైకులు , 1 ఆటో స్వాధీనం, 7 మంది రౌడీ షీటర్స్ ఇళ్ళు తనిఖీ.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యం.ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు.జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు.. అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తాం.ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, వెండి, బంగారు వంటి చోరీ సొత్తు,అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్నీ వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు వాటివి గుర్తించిస్వాధీన పరుచుకోవడం.చంద్రబాబు నగర్ పరిధిలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా శోధించిన నెల్లూరు పోలీసులు.