నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ సందర్శించారు. రోగుల పరామర్శ, అన్నా క్యాంటీన్ ప్రారంభం, పేదవారి కోసం క్యాంటిన్లు ఏర్పాటు అంశాలు చర్చించారు.

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.

రోగులకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ తో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభించి అక్కడే భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయబడినవి, అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటిన్లను నిలిపివేసింది.

ఈ అన్న క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు.గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు నిలిపివేయడంతో స్వంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మవతి, రెండు రూపాయలకే అన్న క్యాంటిన్ నిర్వహించారన్నారు.

ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటిన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఈ క్యాంటిన్లు పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయని, ప్రతి రోజు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి చింతకాయల పద్మవతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జనసేన ఇన్‌చార్జి సూర్యచంద్ర, ఆర్డీవో జయరామ్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *