తిరుపతి మామండూరులో పవన్ కళ్యాణ్ అటవీ పర్యటన సందడి:తిరుపతి జిల్లా మామండూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. అటవీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ALSO READ:గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య
అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, నిల్వ పరిస్థితులను సమీక్షించారు. ఎర్రచందనం రక్షణకు తీసుకుంటున్న చర్యలపై పవన్ కళ్యాణ్ అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు.

అలాగే తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అటవీ సంరక్షణ, ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశాలు ఇవ్వనున్నారు.
స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు చేరుకున్నారు.
