కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో డీఎస్‌ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను టేకుమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని, ఆటగాళ్లను అభినందించారు.
ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో 36 జట్లు పోటీపడ్డాయి. ఫైనల్ పోటీలో గాడిమొగ, కోరంగి జట్లు పోటీ పడ్డాయి. చివరకు విజేతగా కోరంగి జట్టు నిలవగా, రన్నరప్‌గా గాడిమొగ జట్టు నిలిచింది. మూడో స్థానాన్ని సీతాపురం జట్టు, నాలుగో స్థానాన్ని తాళ్లరేవు జట్టు కైవసం చేసుకున్నాయి.
ఫైనల్ విజేతలకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. విజేతల జట్లకు మెమెంటోలు అందజేస్తూ, ఈ టోర్నమెంట్‌ను ప్రతీ ఏడాది మరింత ప్రాముఖ్యతతో నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో మందాల గంగ సూర్యనారాయణ, టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపూడి వెంకటరమణ, గుత్తుల సాయి, కొత్తూరు కాశిశ్వరుడు, పొన్నమండ రామలక్ష్మి, ముత్యాల జయలక్ష్మి, ఉంగరాల వెంకటేశ్వరరావు, మోపూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.