కాకినాడ జిల్లా తుని నియోజకవర్గo లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుని నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలతో అధికారి యంత్రాంగం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతూ తాండవ నది పరివాహక ప్రాంతంలో నివసించే గ్రామాలలో దండోరా మైకు ప్రచారాలతో అధికారులు నాయకులు అప్రమత్తమయ్యారు . సోమవారం వరద ముంపు ప్రాంతాలలో తాండవా నది పరివాహ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జ్ ల వద్ద కోటనందూరు రెండు జిల్లాల సరిహద్దు గ్రామo కావడంతో ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా రెవెన్యూ పోలీస్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా సహాయక చర్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుని రూరల్ సీఐ చెన్నకేశవ, కోటనందూరు ఎస్సై రామకృష్ణ, కోటనందూరు టిడిపి నాయకులు మెల్లగా వెంకట కృష్ణారావు, బోడపాటి సత్యనారాయణ, అంకం రెడ్డి వెంకటేష్ ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరా బాయ్,పల్లారామకృష్ణ, పడాల సత్యనారాయణ కడితే నూకరాజు, ప్రవీణ్, జనసేన నాయకులు అంకమ్మ రెడ్డి రాజశేశు, టిడిపి నాయకులు లగుడు సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
తాండవా పరివాహక ప్రాంతాల్లో వరద అప్రమత్తం
తాండవా పరివాహక ప్రాంతాల్లో వరద అప్రమత్తం
