తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన ‘బైసన్’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కథానాయకుడు ధ్రువ్ విక్రమ్ మాట్లాడుతూ సినిమా కోసం తన చేసిన కష్టాన్ని వివరించారు.
ధ్రువ్ పేర్కొన్నారు, “ఈ పాత్ర కోసం సుమారు మూడేళ్లు కబడ్డీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. షూటింగ్‌లో అనేకసార్లు గాయపడ్డాను. ఎడమ చేయి విరగడంతో పాటు మూడు పళ్లు కూడా దెబ్బతిన్నాయి. సినిమా నంబర్ల గురించి కాకుండా ప్రేక్షకుల ప్రేమ సంపాదించడమే ముఖ్యం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మా నాన్న విక్రమ్ స్టార్ అయ్యారు. నేను కూడా ఆయనలాగే కష్టపడి తెలుగు అభిమానాన్ని పొందాలనుకుంటున్నాను.”
తన డైలాగ్స్ రాసిన వ్యక్తి, ‘హాయ్ నన్న’ డైరెక్టర్, తన స్నేహితుడు శౌర్య అని ధ్రువ్ తెలిపారు.
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, “మరి సెల్వరాజ్ దర్శకత్వంలో పనిచేయాలన్న నా కల ఈ చిత్రం ద్వారా నెరవేరింది. ధ్రువ్ డెడికేషన్ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. తమిళంలో వచ్చిన అద్భుతమైన స్పందన తెలుగులో కూడా వస్తుందని నమ్ముతున్నాను” అని పేర్కొన్నారు.
ఈ సినిమా అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ పతాకాలపై పా. రంజిత్ సమర్పణలో, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందింది. అర్జున అవార్డు గ్రహీత, కబడ్డీ క్రీడాకారుడు మణతి గణేశన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించబడింది. క్రీడా స్ఫూర్తి, సామాజిక అంశాలను స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ బ్యానర్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.