అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన ‘తండేల్’ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఎనిమిది రోజుల్లోనే రూ.95.20 కోట్లు వసూలు చేసి, త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది.
టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విజయంలో డీఎస్‌పీ మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.
సాయి పల్లవి, నాగచైతన్య తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేశారు. బుజ్జితల్లి, రాజుగా వారి నటన ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. ముఖ్యంగా ప్రేమ, తల్లి సంబంధిత భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. సినిమా ప్రారంభం నుండి చివరి దాకా వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా మెప్పించింది.
పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్. అద్భుతమైన విజువల్స్, కథనంతో దర్శకుడు చందు మొండేటి మరో విజయం అందుకున్నాడు. ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘తండేల్’ 100 కోట్ల వైపు దూసుకెళ్తోంది.