డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

విశాఖ దక్షిణలో జర్నలిస్టుల డే సందర్భంగా, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జర్నలిస్టులను సత్కరించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ సహాయం అందించనున్నారు. డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు

జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,
32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం లోనే తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వం కూడా జర్నలిస్టుల అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉందన్నారు.
డాక్టర్ కందుల నాగరాజు ఘనంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తాను ఒక అతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ
ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు ఒక వారిదిగా పనిచేస్తున్నారని వెల్లడించారు.
సమాజానికి చేస్తున్న వారి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
ఇప్పటికీ జర్నలిస్టులలో చాలామందికి సొంత ఇల్లులు లేని వారు ఉన్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు ఆలోచిస్తుందని చెప్పారు.
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విశాఖ జర్నలిస్టులకు జర్నలిస్టు డే సందర్భాన్ని పురస్కరించుకుని అతిథులు చేతుల మీదుగా సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.తన పరిధి మేరకు కూడా జర్నలిస్టుల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబెర్ గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ డాక్టర్ కందుల నాగరాజు చేస్తున్న సేవలు స్లాగనీయమైనవని కొనియాడారు.
వార్డు పరిధి మేరకే కాకుండా దక్షిణ నియోజకవర్గం మొత్తం అంతా కూడా తన సేవలను విస్తరించాలని ప్రశంసించారు.
ఆయన ట్రస్ట్ చైర్మన్ గానే కాకుండా జనసేన నాయకుడిగా అలాగే 32 వ వార్డు కార్పొరేటర్ గా ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఇందులో భాగంగా జర్నలిస్టులను సత్కరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తాను ముందు ఉన్నానని అంటూ జర్నలిస్టులందరికీ సహాయం చేసే మంచి వ్యక్తిత్వం డాక్టర్ కందుల నాగరాజుది అని కొనియాడారు. కార్యక్రమంలో సుమారు 60 మంది జర్నలిస్టులను అతిధుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శివప్రసాద్ రెడ్డి, బివి రామ్ , సాలివాహన , డాక్టర్ సునీల్ , కందుల కృష్ణ , కందుల రాజశేఖర్ , నారా నాగేశ్వరరావు, మద్ది రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి , మహేశ్వర రావు ,చంటి, ఈశ్వరరావు, సాయి, రాజు, అప్పలరాజు, దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు, 32 వార్డ్ ఇంచార్జ్ కందుల బద్రీనాథ్,
కందుల కేదార్నాథ్ ,
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *