ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ రైల్వే డివిజన్‌లో గురువారం మరోసారి రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తే సంఘటన చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు ఒకదానికొకటి ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అయితే లోకోపైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరించి రైళ్లను సమయానికి నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
సిగ్నల్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని ప్రాథమిక సమాచారం తెలుస్తోంది.
ఇదే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే కాంతో రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ప్రయాణికుల రైలు ఢీకొట్టిన ఘటనలో 11 మంది మృతి చెందగా, లోకోపైలట్ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
READ ALSO:హాంకాంగ్ సిక్సెస్ 2025:కెప్టెన్‌గా దినేష్ కార్తిక్
ఆ ప్రమాదం మరువకముందే మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రైల్వే భద్రతా వ్యవస్థలో నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే అధికారులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
