చిరు బర్త్‌డేకు విశ్వంభర ఫస్ట్‌లుక్ సర్‌ప్రైజ్

Megastar Lines Up The Star Directors | Telugu Rajyam

నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న ‘విశ్వంభ‌ర’ మూవీ ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో చిరు త్రిశూలాన్ని పట్టుకుని గంభీరంగా క‌నిపిస్తున్నారు. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ ద‌ర్శ‌క‌త్వంలో సోషియో ఫాంటసీ డ్రామాగా విశ్వంభర తెర‌కెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ పాత్ర అంద‌రినీ అబ్బురపరిచే విధంగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు వెల్ల‌డించాడు.

అన్న‌ట్టుగానే తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ ఉండ‌డంతో చిరు అభిమానుల‌కు ఇది ప్రత్యేక పుట్టినరోజు ట్రీట్‌గా మారింది. ఇక ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న‌ విశ్వంభరలో చిరంజీవి స‌ర‌స‌న‌ త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 

అలాగే కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అకాడమీ అవార్డు విజేత ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10న విశ్వంభ‌ర‌ థియేటర్లలో సంద‌డి చేయ‌బోతోంది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *