గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారి నైపుణ్యాలను మెరుగుపరచి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే సి.యం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి తెలిపారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు నిర్వహించే జిల్లాస్థాయి సి.యం కప్ పోటీలను వనపర్తి జిల్లా ప్రభుత్వ బాలుర కళాశాల క్రీడా మైదానంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామీణ, మండల స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నందుకు అభినందనలు తెలిపారు. క్రీడా అభివృద్ధికి సి.యం కప్ ఉపయోగపడాలని, అందులో ప్రతిభ కనబరిచిన వారికి అకాడమీలో శిక్షణ ఇచ్చి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు.
క్రీడాకారులకు ఇచ్చే ప్రశంసా పత్రాలను భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గ్రేస్ మార్కులుగా పరిగణిస్తామని తెలిపారు. సి.యం కప్ క్రీడలు ప్రతిభను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, క్రీడలు ద్వారా తెలంగాణ గ్రామీణ ప్రాంత యువతకు ఉన్నత స్థాయి అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా ప్రతిభ కనబరిచే క్రీడాకారులను పటిష్టంగా ప్రోత్సహించి, వారి భవిష్యత్తును నిర్మించే చర్యలకు ప్రభుత్వం బలమైన మద్దతు అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు.