కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మనస్తాపం – కొండమల్లేపల్లిలో వ్యక్తి ఆత్మ*హత్య

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో మానసిక వేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీరా రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం, డిండి మండలం కామేపల్లి గ్రామానికి చెందిన జెట్టమోని నరసింహ (55) హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు.

కొన్ని సంవత్సరాల క్రితం ఆయన భార్య గెల్వలమ్మ కరోనా సమయంలో మృతి చెందింది. అప్పటి నుంచి నరసింహ ఒంటరిగా జీవిస్తున్నాడు.

ALSO READ:నరసరావుపేట డీఎస్పీపై మాజీ మంత్రి విడదల రజినీ సంచలన ఆరోపణలు – “వదిలే ప్రసక్తే లేదు” హెచ్చరిక

ఇటీవల ఆయన కొడుకు అంజనేయులు, కోడలు మాధవితో తరచుగా కుటుంబ కలహాలు జరుగుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి, డ్యూటీకి వెళ్లకుండా కొండమల్లేపల్లికి చేరుకున్నాడు. అక్కడ పశువుల సంత సమీపంలో అర్థరాత్రి ఓ రేకుల పందిరిలో నైలాన్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *