మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం శివారు మీట్యా తండా సమీపంలోని ఎస్. ఆర్.ఎస్.పి కాలువకు
గండి పడి జలాలు వృధాగా పోవడమే గాకుండ సమీపంలోని పంట పొలాలు నీట మునిగి పోయాయి. సాగు చేసే పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువకు గండి పడి జలాలు వృధాగా పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. ఉదయం వేళ ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని అదే రాత్రి వేళ అయితే పెను నష్టం జరిగేదని తండా వాసులు ఆందోళన చెందారు.
