కలకత్తా రాష్ట్రంలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైద్యులందరూ కలిసి నల్లా బ్యాడ్జీలు ధరించి జిల్లా కేంద్రంలో ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కలకత్తాలో రాష్టం లో మహిళ వైద్యురాలి పై జరిగిన సంఘటన ను నిరసిస్తూ హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున వైద్యులు డిమాండ్ చేస్తున్నామని అన్నారు నిత్యము ప్రజల కొరకు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యాలు అందిస్తూ నిత్యము ప్రజల కొరకు పని చేస్తున్న వైద్యుల పై దాడి చేయడం ఖండిస్తున్నామని అన్నారు మహిళ వైద్యురాలి పై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని జిల్లా కేంద్రంలో వైద్యులు అందరూ కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్లీ జరగకుండా వైద్యులపై దాడి చేసే వారిపై చర్యలు తీసుకొని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ ఆస్పత్రుల వైద్యులు వైద్యులు నర్సులు పాల్గొన్నారు.
- Home
- National News
- కలకత్తా రాష్ట్రంలో మహిళ వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ వైద్యుల నిరసన